ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నెమ్మదించినా.. కొన్ని దేశాల్లో వైరస్ ఉధృతి అధికంగా ఉంది. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ల వ్యాప్తితో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా పాజిటివిటీ రేటు 30శాతం దాటింది. ఐదు నెలల అనంతరం ఈ స్థాయిలో పాజిటివిటీ రేటు నమోదు కావడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ఉపరకాల ప్రభావంతో దక్షిణాఫ్రికాలో గతకొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే 8,524 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 31.1శాతం ఉన్నట్లు అక్కడి జాతీయ అంటువ్యాధుల కేంద్రం వెల్లడించింది. ఐదు నెలల క్రితం డిసెంబర్ 5న 32.2శాతం పాజిటివిటీ నమోదైందని, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈస్థాయిలో రికార్డయిందని సంబంధిత అధికారులు తెలిపారు.
