ప్రత్తిపాడు నియోజకవర్గంలో హోంమంత్రి సుచరిత పర్యటించారు. బుడంపాటు, ఏటకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ.. దిశ మొబైల్ యాప్‌కు మంచి స్పందన వస్తోందన్నారు. పోలీసులు వెంటనే స్పందిస్తున్నారని బాధితులు అభినందిస్తున్నారన్నారు. దిశ చట్టం దేశంలోనే ఆదర్శం కానుందన్నారు. అయితే మంగళగిరి గ్యాంగ్‌రేప్‌పై మాత్రం సుచరిత నోరు మెదపలేదు. దీంతో సొంత జిల్లాలో గ్యాంగ్‌రేప్ జరిగితే స్పందించలేదంటూ ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
