దేవీనిని ఉమా కి జోగి రమేష్ వార్నింగ్
దేవీనిని ఉమా కి జోగి రమేష్ వార్నింగ్

దేవీనిని ఉమా కి జోగి రమేష్ వార్నింగ్

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అభ్యంతరకరమైన భాష వాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆయన భరతం పడతామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఉమా తన భాషను మార్చుకోకుంటే ఆయన తోక కత్తిరిస్తానని, తానే ఆయన ఇంటికి వెళతానని అన్నారు.స్వయం ప్రకటిత మేధావి యనమల, అచ్చోసిన ఆంబోతు అచ్చెన్నాయుడు, లోకజ్ఞానం లేని లోకేష్, బొంకే బుచ్చయ్య, ఇష్టానుసారం మాట్లాడుతున్నారు అని రమేష్‌ ధ్వజమెత్తారు. పోలవరం కట్టిందెవర్రా.. అంటూ ఉమా నోరు పారేసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.