పరిశ్రమలకు 70 శాతం విద్యుత్‌ సరఫరా : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పరిశ్రమలకు వారంలో అన్ని రోజులపాటు విద్యుత్‌ సరఫరా చేసేందుకు, 70 శాతం మేర విద్యుత్‌ వినియోగానికి అవకాశం కల్పించినట్లు విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం రోజుకు 235 మిలియన్‌ యూనిట్ల నుంచి 186 మిలియన్‌ యూనిట్లకు తగ్గిన నేపథ్యంలో పరిశ్రమలకు సరఫరాను పెంపొందించే విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.