పోలవరం అధికారులతో సీఎం జగన్ సమీక్ష
పోలవరం అధికారులతో సీఎం జగన్ సమీక్ష

పోలవరం అధికారులతో సీఎం జగన్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. ఏరియల్‌ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను వీక్షించారు. స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌ పనులను పరిశీలించిన సీఎం వైఎస్‌ జగన్‌.. 2021 జూన్‌ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయడంపై అధికారులు, ఇంజనీర్లకు మార్గనిర్దేశనం చేశారు. ఈమేరకు కార్యాచరణ ప్రణాళికపై సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులతో నిశితంగా మాట్లాడారు. ప్రాజెక్టు పరిశీలన తర్వాత అధికారులు, ఇంజినీర్లు, కాంట్రాక్టు సంస్థలు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సీఎం సమీక్ష చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యమైందని పేర్కొన్న సీఎం వైఎస్‌ జగన్‌.. గడువులోగా ప్రాజెక్టు పనులు పూర్తి కావాలన్నారు. ఆ మేరకు కార్యచరణ రూపొందించాలని అధికారులు ఆదేశించారు.