మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి కన్నుమూత

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పేర్ల శివారెడ్డి(83) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రొద్దుటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, శుక్రవారం ఉదయం స్థానిక వైఎంఆర్‌ కాలనీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. శివారెడ్డి 1978లో కమలాపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. శివారెడ్డి మృతితో ఆయన స్వగ్రామమైన ఎర్రగుంట్లలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రొద్దుటూరులో సాయంత్రం 4గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.