మాస్‌ లుక్‌లో బాలయ్య

నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్ర చేస్తున్నారు. నేడు దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు 100వ జయంతి సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ని మేకర్‌స విడుదల చేశారు. చేతిలో కత్తిని పట్టుకొని బాలయ్య మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో కన్నడ స్టార్‌ దునియా విజరు విలన్‌గా నటిస్తున్నాడు. బాలకృష్ణ కెరీర్‌లో 107వ చిత్రమిది. టైటిల్‌ని త్వరలోనే ప్రకటిస్తాం’అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్నాడు.