మా ఎన్నికల్లో విష్ణు ప్యానల్‌దే విజయం

తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. హౌరాహౌరీగా సాగిన ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. మంచు కుటుంబానికే ‘మా’ పీఠం దక్కింది. విమర్శలు, వివాదాలు నడుమ సాగిన ఎన్నికల్లో మొదటి నుంచి ఆధిక్యంలో ఉన్న ఆయన ప్రకాశ్‌రాజ్‌పై విజయం సాధించారు. జాయింట్‌ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన గౌతమ్‌ రాజు విజయం సాధించగా, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌ అధిక ఓట్లతో గెలుపొందారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు టీమ్‌ నుంచి పృథ్వీ రాజ్‌ విజయం సాధించారు.
జాయింట్‌ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన గౌతమ్‌ రాజు విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌ గెలుపొందారు. బాబూ మోహన్‌పై శ్రీకాంత్‌ విజయం సాధించారు.