దేశంలోనే అత్యధిక కరోనా కేసులతో మహారాష్ట్ర ముందంజలో ఉంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో ఒక్క ముంబై నగరంలోనే సుమారు సగం కేసులు నమోదవుతుండటం అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా సోకింది. బీఎంసీ(బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. అయితే వారెవరికీ కరోనా లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. ఏప్రిల్ 16,17 తేదీల్లో రిపోర్టర్లు, కెమెరామన్లు కలుపుకుని మొత్తంగా 167 మంది జర్నలిస్టులకు పరీక్షలు నిర్వహించగా వీరిలో సుమారు 53 మందికి సోకినట్లు తేలింది.

ముంబై లో 53 మంది జర్నలిస్టులకు కరోనా