వ్యక్తిగత కారణాలతో కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న హీరో మంచు మనోజ్ అభిమానులకు శుభవార్త చెప్పారు. ఇటీవల ఓ ఆసక్తికర విషయాన్ని ప్రకటించనున్నట్టు తెలిపిన మనోజ్.. తన కొత్త సినిమా గురించిన వివరాలను గురువారం వెల్లడించారు. అందుకు సంబంధించిన ఓ పోస్ట్‌ర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. 3 ఏళ్ల తర్వాత సినిమా చేస్తున్నానని మనోజ్ ఈ సందర్భంగా తెలిపారు. తన తొలి సినిమా ‘దొంగ దొంగది’ సమయంలో ఎలాంటి భావోద్వేగంతో ఉన్నానో ఇప్పుడు అలాంటి అనుభూతితోనే ఉన్నానని అన్నారు.మూడేళ్ల తర్వాత మీ ముందుకు వస్తున్నాను. నా తొలి సినిమా ‘దొంగ దొంగది’కి ఎలాంటి ఎమోషన్‌కు లోనయ్యానో ఇప్పుడు అలానే ఫీల్ అవుతున్నాను. నా జీవితమైన నా కళను మిస్సయ్యాను. సినీ అమ్మ వచ్చేశా. లవ్ యూ డార్లింగ్స్ అని మనోజ్ పేర్కొన్నారు.

మూడేళ్ళ తరవాత మంచు మనోజ్ రీఎంట్రీ