వనదేవతలను దర్శించుకున్న గవర్నర్లు

వనదేవతలను దర్శించుకున్న గవర్నర్లు

తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో గద్దెల వద్ద రద్దీ భారీగా పెరిగింది. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ వనదేవతలను దర్శించుకున్నారు. వారికి అధికారులు ఘనస్వాగతం పలికారు. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు.