వివాదాల్లో ‘శేఖర్‌’

రాజశేఖర్‌ హీరోగా నటించిన ‘శేఖర’్‌ చిత్రం వివాదాలతో నడుస్తోంది. మే 20న విడుదలైన ఈ చిత్ర ప్రదర్శన ఫైనాన్షియర్‌ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా మే 22న అన్ని థియేటర్లలో ఆపేశారు. వంకాయల పాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా నిర్మాత సుధాకర్‌ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ‘నా సినిమాను ఆపేసి అన్యాయం చేశారు. డిజిటల్‌ ప్రొవైడర్స్‌కు నేను డబ్బు కట్టి ఒప్పందం చేసుకున్నాను. లీగల్‌ డాక్యుమెంట్స్‌ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. శేఖర్‌ సినిమాను ఆపేయమని కోర్టు ఎక్కడా చెప్పలేదు.