సోనాలి బింద్రే జీ5 ఓటీటీలో రాబోతున్న ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే వెబ్ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. వినరు వైకుల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రచయిత మైక్ బార్ట్లెట్ కథను అందించారు. మీడియా ఛానళ్ల ఛాంబర్స్‌లో జరిగే సన్నివేశాలు ఆధారంగా సిరీస్ ఉండబోతుందని దర్శకుడు తెలిపారు. వార్తల కోసం జర్నలిస్టులు ఎదుర్కొనే సవాళ్లు, ఒత్తిళ్లుఇందులో చూపించనున్నారు. ఈ చిత్రంలో శ్రియా పిల్గావ్కర్, జైదీప్ అహ్లావత్, ఇంద్రనీల్ సేన్‌గుప్తా, తరుక్ రైనా, ఆకాష్ ఖురానా, కిరణ్ కుమార్ నటిస్తున్నారు.
