సమంత మాదిరిగానే ప్రియాంకచోప్రా

టాలీవుడ్‌ ప్రేమ జంట సమంత – నాగచైతన్యలు విడిపోతున్నట్లు ప్రకటించే ముందు సమంత తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అక్కినేని పేరు మార్చింది. అలా సమంత ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పేరు మార్చిన తర్వాత.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు విడిపోనున్నారనే వార్తలన్నీ పుకార్లని మొదట భావించినా.. తర్వాత తాము విడాకులు తీసుకోనున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. అచ్చం సమంత- నాగచైతన్యలా తాజాగా మరో జంట కూడా సెన్సేషన్‌గా మారింది. ఆ జంట మరెవరో కాదు.. గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకచోప్రా, పాప్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌. ప్రాంతాలు, భాషలు, ఆఖరికి వయసు అంతరమున్నా.. పెద్దల్ని ఒప్పించి మరీ 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా.. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే తాజాగా ప్రియాంకచోప్రా ఇన్‌స్టాలో తన భర్త నిక్‌జోనస్‌ పేరును తొలగించి ఇటీవల కొన్ని పోస్టులు చేశారు. భర్త పేరును తొలగించి ప్రియాంక పోస్టులు చేయడంపై కొందరు షాక్‌కి గురయ్యారు. వీరిమధ్య ఏమైనా గొడవలు వచ్చాయా? సామ్‌ – చైల మాదిరిగా విడాకులు తీసుకోనున్నారా అనే చర్చా మొదలైంది.