స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష

స్పందన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు కోవిడ్ 19 నివారణ, లాక్ డౌన్ అమలుపై సమీక్ష నిర్వహించనున్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలపై చర్చ, ఖరీఫ్ సాగుకు సన్నద్ధత, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై చర్చించనున్నారు. గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ పై జిల్లా కలెక్టర్లకు మార్గ నిర్దేశకాలు జారీ చేయనున్నారు. పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం అమలవుతున్న తీరుపై కలెక్టర్లు నుంచి వివరాలు తెలుసుకోనున్నారు.