అమృత్‌సర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సినిమా పేరు ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్‌ సయమం దగ్గరపడటంతో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఈ నెల 19న కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో గ్రాండ్‌గా ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్‌. ఆదివారం గుజరాత్‌లోని బరోడా, ఢిల్లీలో ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపట్టింది. సోమవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పర్యటించింది చిత్రబృందం. సినిమా మంచి విజయం సాధించాలని అక్కడి గోల్డెన్‌ టెంపుల్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌, పెన్‌ స్టూడియోస్‌, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు.