ఎపిలో స్కూళ్ల పున:ప్రారంభం మరోసారి వాయిదా!

ఎపిలో అక్టోబరు 5 నుంచి పాఠశాలలు పున్ణప్రారంభించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. స్కూళ్లను నవంబరులో ప్రారంభించాలని తాజాగా నిర్ణయించింది. కరోనా పరిస్థితులు ఇప్పటికీ సద్దుమణగకపోవడంతో ఈ మేరకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయం ప్రకారం నవంబర్‌ 2న స్కూళ్లు తెరుచుకోనున్నాయి. పాఠశాలల ప్రారంభంతో సంబంధం లేకుండా జగనన్న విద్యాకానుక పథకాన్ని మాత్రం అక్టోబరు 5న ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొని సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు జగనన్న విద్యా కిట్లు పంపిణీ చేయనున్నారు.