ఏడాదిలో కరోనా విజృంభణ ..దేశాలపై ప్రభావం

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమై నేటికి ఏడాదైంది. గతేడాది జనవరి 30న మొదటి కరోనా కేసు నమోదైంది. ఇప్పటివరకు 1.5 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో పాటు మిలియన్ల కుటుంబాలు తమ జీవనోపాధిని కోల్పోయారు. ఇప్పటికీ.. రోజుకి 12వేల నుండి 14 వేల వరకు కేసులు నమోదవుతున్నప్పటికీ.. కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ప్రభుత్వ లెక్కలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పటికీ కరోనా మహమ్మారి ప్రభావం తగ్గలేదని, కేసుల తీవ్రత ఇంకా పెరుగుతూనే ఉందని.. కరోనా వైరస్‌ కొత్త వేరియంట్స్‌ వెలుగుచూస్తున్నాయని శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.