కొన్నసాగుతున్న బద్వేల్ ఉపఎన్నిక పోలింగ్

బద్వేలు ఉపెన్నికలు ఉత్కంఠ భరితంగా కొసాగుతున్నాయి . బద్వేల్‌ ఉపఎన్నికల్లో శనివారం ‘సాయంత్రం 5.గంటల వరకు 55.32శాతం ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం 3.00గంటల వరకు 44.82శాతం ఓట్లు పోలయ్యాయి. కడప బద్వేలులో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరారు. కాశినాయనలో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. అట్లూరు మండలం కామసముద్రంలో పోలింగ్‌ కొనసాగుతోంది. పోరుమామిళ్ల మండలంలో ఉదయం 9 గంటల వరకు 10.54 శాతం పోలింగ్‌ నమోదయింది. బద్వేలులో ఉదయం 9 గంటల వరకు పోలింగ్‌ 10.49 శాతంగా నమోదయింది. ఎన్నికల సిబ్బంది కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.

ఈ రోజు ఉదయం 7 గంటల నుండీ 281 పోలింగ్‌ కేంద్రాలలో బద్వేల్‌ ఉపఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ప్రారంభమయింది. భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈ ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఉపఎన్నికల పోలింగ్‌ కొనసాగనుంది.
124 బద్వేలు (ఎస్సి) నియోజకవర్గ ఉప ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ మాట్లాడుతూ.. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.