కొరటాలతో ‘ఎన్‌టిఆర్‌ 30’

టాలీవుడ్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ‘ఎన్టీఆర్‌ 30’కి సంబంధించిన కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఘన విజయంపై అందరికీ ధన్యవాదాలు తెలిపే మీడియా ఇంటరాక్షన్‌ సందర్భంగా భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. ఎన్టీఆర్‌ తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో చేస్తానని, జూన్‌లో షూటింగ్‌ ప్రారంభమవుతుందని చెప్పారు. షూటింగ్‌ ప్రారంభించడానికి చాలా సమయం ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనిని ప్రారంభిస్తానన్నారు. ఆ సినిమా కోసం బరువు తగ్గబోతున్నారు ఎన్టీఆర్‌. ప్రస్తుతం ఫైనల్‌ స్క్రిప్టు గురించి ఎన్టీఆర్‌, కొరటాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతం, నేపథ్య సంగీతం సమకూర్చనున్నారు.