‘కోవిడ్‌-19 ఏపీ ఫార్మసీ’ యాప్‌ విడుదల
‘కోవిడ్‌-19 ఏపీ ఫార్మసీ’ యాప్‌ విడుదల

‘కోవిడ్‌-19 ఏపీ ఫార్మసీ’ యాప్‌ విడుదల

రాష్ట్రంలో కరోనా( కోవిడ్‌-19) వ్యాధిని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ వైద్య,ఆరోగ్యశాఖ ‘కోవిడ్‌-19 ఏపీ ఫార్మసీ’ అనే పేరుతో మొబైల్‌ యాప్‌ను రూపొందించి శనివారం విడుదల చేసినట్లు తెలిపింది. జ్వరం, దగ్గు, శ్వాస వంటి లక్షణాలతో మెడికల్ షాపులకొచ్చే వారి వివరాల్ని ఈ యాప్‌లో పొందుపర్చాలని మెడికల్‌ షాపు యజమాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్థానిక ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ వచ్చి సంబంధిత వ్యక్తులకు స్వయంగా చికిత్స అందిస్తారని తెలిపింది. ఇక మెడికల్‌ షాపుల యజమానులు తమ మొబైల్‌ నంబర్‌ ద్వారా ఈ యాప్‌లోకి లాగిన్‌ అవ్వాలని పేర్కొంది. లాగిన్‌ అయ్యాక మొబైల్‌ నంబర్‌ లేదా మెడికల్‌ షాపు ఐడీ నంబర్‌ ఎంటర్‌ చేయాలని ఆరోగ్య శాఖ తెలిపింది.గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి Covid 19 AP Pharma యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆరోగ్య శాఖ కోరింది. కోవిడ్‌-19పై పోరాటంలో మెడికల్‌ షాపుల యజమానులు ప్రభుత్వానికి సహకరించాని ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.