గ్యాస్‌ లీక్‌ ఘటనపై సీఎం జగన్‌ సమీక్ష

వైజాగ్ గ్యాస్ లీక్ ఘటన, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేపట్టారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన, అవంతి శ్రీనివాస్‌, కన్నబాబు, జిల్లా అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగులు హాజరయ్యారు. అధి​కారులు గ్యాస్‌ లీక్‌ ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులను ముఖ్యమంత్రికి తెలియజేశారు. సంఘటనా స్థలంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని వివరించారు. సాయంత్రం లోపు బాధితులను వారి ఇళ్లకు చేర్చాలని.. రాత్రికి ఆయా గ్రామాల్లోనే బస చేయాలని సీఎం జగన్‌ మంత్రులను ఆదేశించారు.