గ్రామాల్లోనే అత్యుత్తమ వైద్యసేవలు

 ప్రజలకు గ్రామాల్లోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సిఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోని వ్యవస్థలను, వారి ఆలోచనలను పరిగణలోకి తీసుకుని మార్గదర్శకాలు తయారు చేయాలన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల, కొమరవోలు గ్రామాల్లో ఆకస్మికంగా అస్వస్థతకు గురైన ప్రజలకు ధైర్యాన్నివ్వాలన్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన వైద్యారోగ్యశాఖలో నాడు-నేడుపై సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ రూ.16,270 కోట్లతో నాడు-నేడు కింద వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్స్‌, అర్బన్‌ క్లినిక్స్‌, పిహెచ్‌సిలు, ఏరియా ఆస్పత్రులు, ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలల్లో అభివృద్ధి పనులు, కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలకు సంబంధించి ఏప్రిల్‌ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేయాలన్నారు.