టీడీపీ పై మండిపడ్డ బొత్స
టీడీపీ పై మండిపడ్డ బొత్స

టీడీపీ పై మండిపడ్డ బొత్స

కరోనా వైరస్‌ను ఎదుర్కునేందుకు దేశమంతా సంఘటితంగా పోరాడుతుంటే.. టీడీపీ నేతలు మాత్రం ఇలాంటి క్లిష్ట సమయాల్లో కూడా రాజకీయ విమర్శలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పేద ప్రజలను ఆదుకునేందుకు రూ.1000 సాయం చేస్తే.. దానిపై కూడా సిగ్గు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడూ.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేద ప్రజలను ఆదుకునేందుకు ఇప్పటికే రేషన్‌, కందిపప్పు అందించామన్నారు. సీఎం జగన్‌ ఆదేశాలతో పేద ప్రజలకు రూ.1000 ఆర్థిక సాయం అందించామని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టామన్నారు. అన్ని రంగాలవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.