తాజ్‌కు బాంబు బెదిరింపు కాల్‌

నిత్యం రద్దీగా ఉండే… అత్యంత సుందర ప్రదేశం తాజ్‌మహాల్‌లో బాంబు ఉందన్న వార్త ఒక్కసారిగా కలకలం రేపింది. బాంబు ఉందన్న ఫోన్‌ కాల్‌తో అధికారులు అప్రమత్తమై వెయ్యి మంది పర్యాటకులను బయటకు పంపేశారు. గాలింపు చర్యలు చేపట్టిన అధికారులకు ఎటువంటి బాంబు ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుచుకున్నారు. కొంత సమయానికి ఇది ఫేక్‌ కాల్‌ అని గుర్తించారు. తిరిగి సందర్శనకు అనుమతినిచ్చారు. ఆగ్రా జోన్‌ పోలీసు ఉన్నతాధికారి రాజీవ్‌ కృష్ణ మాట్లాడుతూ… గురువారం ఉదయం ఓ వ్యక్తి ఫోన్‌ చేసి తాజ్‌లో బాంబు ఉందని, అది పేలిపోతుందని కాల్‌ చేశాడని, అదే సమయంలో తాను ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ నియమాకంలో వివక్షకు గురయ్యానంటూ పేర్కొన్నట్లు చెప్పారు.