తీరం దాటిన తుపాను…పలు చోట్ల భారీ వర్షాలు

నివర్‌..షివర్‌ పుట్టిస్తోంది. పుద్చుచేరి సమీపంలో తీరం దాటి అతి తీవ్ర తుపాను నుండి తీవ్ర తుపానుగా బలహీనపడింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి, గురువారం తెల్లవారు జామున 2.30 గంటల మధ్య నివర్‌ తుపాన తీరం దాటినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తుపాను అలజడికి తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. చలికి తోడు, వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు. తుపాను తీరం దాటాక గంటకు 120-145 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు చెన్నై సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారుతున్నాయి. పలు చోట్ల సముద్రం ముందుకొచ్చింది. నివర్‌ తుపాన్‌ తమిళనాడు, పుదుచ్చేరిలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.