తెలంగాణ హైకోర్టు మూసివేత‌

తెలంగాణ హైకోర్టులో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు, సెక్యూరిటీ సిబ్బందికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డం క‌ల‌క‌లం రేపుతోంది. మంగ‌ళ‌వారం న్యాయ‌స్థానంలో ప‌ని చేసే 50 మందికి సిబ్బందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. నేడు దీని ఫ‌లితాలు వెలువ‌డ‌గా అందులో 10 మందికి పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు హైకోర్టు భ‌వ‌నాన్ని మూసివేసి శానిటైజేష‌న్ చేస్తున్నారు. హైకోర్టులోని ఈ-ఫైలింగ్ విభాగాన్ని జ్యుడీషియ‌ల్ అకాడ‌మీకి త‌ర‌లించారు.మ‌రోవైపు క‌రోనా ప్రబ‌‌లుతున్న వేళ ముందు జాగ్ర‌త్త‌లు చేప‌ట్టిన హైకోర్టు వీడియో కాన్ఫ‌రెన్స్‌ల ద్వారా ముఖ్య‌మైన కేసుల విచార‌ణ చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే మ‌రిన్ని కేసులు వెలుగుచూస్తున్న త‌రుణంలో ఇదే విధానాన్ని కొన‌సాగిస్తూ కేసుల విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు నిర్ణ‌యం తీసుకుంది