నిమ్మగడ్డ తీరుపై మళ్ళీ కోర్టుకు ఏపీ సర్కార్‌

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఆయన లక్ష్మణ రేఖను దాటారని ప్రభుత్వం భావిస్తోంది. నిమ్మగడ్డ తీరును తప్పుపడుతూ.. ప్రభుత్వం త్వరలోనే గవర్నర్‌ను కలవాలని నిర్ణయించింది. అదేవిధంగా ప్రజాప్రతినిధుల విషయంలో కూడా ఎస్‌ఈసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేసే అంశంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఎస్‌ఈసి పరిధిని ఫిక్స్‌ చేసేందుకు కోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం చూస్తోంది. పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో టీడీపి మ్యానిఫెస్టోను రిలీజ్‌ చేయడంపై… టీడీపీ మ్యానిఫెస్టో పై ఎస్‌ఈసి మాట్లాడకపోవడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఎన్నికల కమిషనర్‌ శనివారం కడపజిల్లాలో పర్యటిస్తున్నారు. కడపలో పంచాయతీ ఎన్నికల పనితీరును తెలుసుకునేందుకు అయన కడప వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని, అసాధారణంగా ఏకగ్రీవాలు మంచిది కాదని అన్నారు.