నిర్భయ దోషి పవన్‌ పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

నిర్భయ దోషి పవన్‌ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిర్భయ సంఘటన జరిగిన సమయానికి తాను జువనైల్‌నని పేర్కొంటూ గతంలో పవన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను అప్పట్లోనే సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా ఆ నిర్ణయాన్ని పున:పరిశీలించాలంటూ పవన్‌ తాజాగా మరొక పిటిషన్‌ను దాఖలు చేశాడు. సంఘటన జరిగిన నాటికి తాను జువనైల్‌నని, తన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని కోరాడు. అయితే తాజా పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.