నెయిల్ పాలిష్‌ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండిలా..

నెయిల్ పాలిష్ కొనే బదులు ఇంట్లోనే ఒకటి తయారుచేసేసుకోండి. నిజానికిది ఎంతో సింపుల్. మరి ప్రాసెస్ లోకి వెళ్లిపోదామా…!

1. నేచురల్ నెయిల్ పెయింట్

కావలసిన పదార్థాలు

  • బెల్లం – 50 గ్రాములు
  • మెహందీ లేదా హెన్నా పౌడర్ – 1 టీస్పూన్
  • లవంగాలు – 20 గ్రాములు

ప్రాసెస్:

బెల్లాన్ని పౌడర్ లా మార్చేవరకు గ్రైండ్ చేయండి. ఆ తరువాత ఒక బౌల్ లోకి బెల్లం పౌడర్ ను తీసుకోండి. మధ్యలో కాస్తంత ఖాళీను క్రియేట్ చేసి అందులో లవంగాలను పెట్టండి.
ఇప్పుడు ఇంకొక బవుల్ ను వీటిపైన ఉంచి వీటిని గ్యాస్ స్టవ్ పై పెట్టండి. వేడి ఎక్కనివ్వండి. దాదాపు 10 నిమిషాల్లో ఆవిరి రావడాన్ని గమనిస్తారు. ఆ తరువాత ఇది వాటరీగా మారుతుంది.
ఇప్పుడు ఈ వాటరీ మిక్స్ కు కాస్తంత హెన్నా పౌడర్ ను కలపండి. దీన్ని నెయిల్స్ కు కోటింగ్ గా అప్లై చేయవచ్చు. కాస్తంత చల్లారాక నెయిల్ కోట్ గా ఈ మిశ్రమాన్ని వాడండి. కాటన్ బాల్ ను ఉపయోగించి నెయిల్ కోట్ అప్లై చేసుకోవచ్చు. ఇది గోర్లపై చాలా కాలం ఉంటుంది.

నెయిల్ పాలిషెస్ అనేవి కొన్ని రోజుల తరువాత పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతాయి. నెయిల్స్ పై అనీవెన్ గా ఉంటాయి. ఈ నేచురల్ నెయిల్ పెయింట్ కనీసం రెండు వారాల పాటు ఉంటుంది. దానంతటదే పోతుంది. చాలాసార్లు నెయిల్ పాలిష్ లో ఉండే కెమికల్ కంపొషిషన్స్ వల్ల స్కిన్ యొక్క నేచురల్ కలర్ దెబ్బతింటుందని. బెల్లం, లవంగాలు అలాగే హెన్నా వంటివి నెయిల్స్ ను ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడి నెయిల్స్ ను హెల్తీగా ఉంచుతాయి.