నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి మోహన్‌ బాబు మనవరాలు

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు మనవరాలు, మంచు లక్మీ కుమార్తె విద్యా నిర్వాణ యంగ్‌ చెస్‌ ట్రైనర్‌గా నోబెల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో స్థానం సంపాదించారు. శనివారం నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధి డా. చోకలింగం బాలాజీ సమక్షంలో జరిగిన పరీక్షల్లో విద్యా ఉత్తీర్ణురాలు కావడంతో ఈ రికార్డు సొంతం చేసుకున్నారు. బాలాజీ మాట్లాడుతూ ఆరేళ్ల వయస్సులోనే విద్యా నిర్వాణ చెస్‌ గేమ్‌లో ట్రైనింగ్‌ ఇవ్వడం గొప్ప విషమయని, మా సంస్థ తరుపున రికార్డ్‌ అందించినందుకు హ్యాపీగా ఉందని అన్నారు. నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో విద్య చోటు సంపాదించడంతో మంచు ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగిపోయింది.