పర్యాటక శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి అవంతి శ్రీనివాస్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం అవంతి మాట్లాడుతూ, ‘సమావేశంలో టూరిజం పాలసీ గురించి చర్చించారు. 12 ప్రాంతాల్లో 7 స్టార్ హోటల్స్, ఇంటర్నేషనల్ స్థాయి హోటల్స్ త్వరలోనే రానున్నాయి. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఓపెన్ చేస్తాం.ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నటువంటి హోటల్స్, రిసార్ట్స్ కోవిడ్ వల్ల నష్టపోయాయి. వారందరూ రాయితీల కోసం వినతి పత్రాలు ఇచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సానుకూలంగా స్పందించారు. విజయవాడ బాపు మ్యూజియం త్వరలోనే ప్రారంభిస్తాం. శిల్పారామాలను కూడా పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేస్తాం అని అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. సెప్టెంబర్‌ నుంచి టూరిస్టులను అనుమతించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.