పెరిగిన ఆర్‌ఆర్‌ఆర్‌ టికెట్‌ ధరలు

పీ, తెలంగాణా రెండు రాష్ట్రాల్లోనూ సినిమా టికెట్‌ ధరలను పెంచుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక భారీ బడ్జెట్‌ సినిమాలు విడుదలైనప్పుడు ఐదో ఆటకు అనుమతినివ్వడంతోపాటు, వారం పదిరోజులపాటు టికెట్‌ ధరలను పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతమున్న టికెట్‌ ధరలపై ప్రతి టికెట్‌కు రూ. 50 (మల్టీప్లెక్స్‌లో రూ. 100)పెంచుకునేలా థియేటర్లకు వెసులుబాటు కల్పించింది. అయితే ఈ ధర కేవలం మూడు రోజులు మాత్రమే. ఆ తర్వాత మూడు రోజులు రూ. 30 (మల్టీప్లెక్స్‌ల్లో రూ. 50)లకే అవకాశం కల్పించింది.