మహిళా దర్శకురాలితో మహేశ్‌ బాబు‌ సినిమా ?

అశేష ప్రేక్షకాదరణ పొంది.. ఆస్కార్‌ బరిలో పోటీపడుతోన్న ‘ఆకాశం నీ హద్దురా’ (శూరరై పోట్రు) సినిమాను రూపొందించిన సుధా కొంగర మహిళా దర్శకురాలితో సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు పనిచేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది సూర్య హీరోగా రూపొందిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ (శూరరై పోట్రు). ఈ సినిమాకు సుధా కొంగర దర్శకురాలు. ఓటీటీ లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులే కాదు, విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ప్రస్తుతం మన దేశం తరపున ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఆస్కార్‌ బరిలో పోటీ పడుతుంది. ఇలాంటి మంచి చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సుధా కొంగర దర్శకత్వంలో మహేశ్‌ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట.