మే 27న ‘ఎఫ్‌3’

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్‌ ‘ఎఫ్‌3’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఎఫ్‌3’ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ కంపోజర్‌గా వ్యవహరిస్తున్నారు. సోమవారం వాలంటైన్స్‌ డే సందర్భంగా చిత్రబృందం కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ, ‘ఎఫ్‌3’ మే 27న థియేటర్లలోకి వస్తున్నట్లు వెల్లడించింది. ”పిల్లలు పరీక్షలు ముగించుకోండి.. పెద్దలు సమ్మర్‌ సందడికై తయారుకండి.. ఫన్‌ పిక్నిక్‌కి డేట్‌ ఫిక్స్‌ చేశాం!” అంటూ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.