మొట్టమొదటిసారి మహిళా కానిస్టేబుల్‌కు వీక్లీ బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ అవార్డ్‌

జాతీయ రహదారిపై దొంగతనానికి పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో తెగువ చూపిన మహిళా కానిస్టేబుల్‌ కు అవార్డును జిల్లా ఎస్పీ అందజేశారు. మహిళా కానిస్టేబుల్‌కు తేనీరు అందించి, ఆమె చూపిన తెగువకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కంచికచర్ల పరిధిలో జాతీయ రహదారిపై జరిగిన దొంగతనం కేసులో నిందితులను అదుపులోకి తీసుకోవడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన కంచికచర్ల పోలీస్‌ స్టేషన్‌ మహిళా కానిస్టేబుల్‌-1577 టీ శివకుమారి కి మంగళవారం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఐపీఎస్‌ వీక్లీ బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ అవార్డును అందజేశారు. ఈ అవార్డు పొందిన మొట్టమొదటి మహిళా కానిస్టేబుల్‌ శివ కుమారి కావడంతో ఆమెకు జిల్లా ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.