రష్యా ని గడగడలాడిస్తున్న కరోనా
రష్యా ని గడగడలాడిస్తున్న కరోనా

రష్యా ని గడగడలాడిస్తున్న కరోనా

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి రష్యాలో విజృంభిస్తోంది. ఇక్కడ కొత్తగా 6,361 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ గడిచిన 24 గంటల్లోనే రికార్డయ్యాయి. దీంతో ఈ దేశంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 80,949కి చేరింది. అలాగే కొత్తగా 66మంది కరోనా బాధితులు ప్రాణాలు విడిచారు. దీంతో ఇక్కడి కరోనా మరణాల సంఖ్య 747కు చేరింది.