రాజకీయ ప్రవేశం పై కీలక వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్
రాజకీయ ప్రవేశం పై కీలక వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్

రాజకీయ ప్రవేశం పై కీలక వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశానికి ప్లాన్ రెడీ చేసుకున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ‘చెన్నైలో రజినీ మక్కల్ మండ్రం’ ఆఫీస్ బేరర్లతో ఆయన భేటీ దీన్ని ధ్రువపరుస్తోంది. సమావేశంలో రజినీ మాట్లాడుతూ.. 15 ఏళ్లుగా తన రాజకీయ ప్రవేశంపై అనేక ఊహాగానాలు ఉచ్చాయని.. వాటికి స్వస్తి పలకాల్సిన సమయం వచ్చిందన్నారు. 2017లో రాజకీయ ప్రవేశంపై వివరణ ఇచ్చానన్న ఆయన.. నాటి నుంచి తమిళనాడు పరిస్థితులను విశ్లేషించడం మొదలుపెట్టానన్నారు. ప్రజల మనస్తత్వం కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవస్థలో మార్పు రావలసి ఉందని భావించానని.. రాజకీయ నాయకులకు ప్రజలంటే కేవలం ఓట్లేనని.. సమయానికి తగ్గట్టు పాలన లేదని వ్యాఖ్యానించారు. అత్యధికమంది పార్టీలో భాగస్వాములయ్యేలా చూసుకుంటానన్నారు. తనకు మూడు ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నారు. జయ మరణం తర్వాత రాజకీయ అస్థిరత ఏర్పడిందని.. ప్రభుత్వం, పార్టీలపై ఒకే వ్యక్తి పెత్తనం సరికాదన్నారు. ఇప్పుడున్న పార్టీల్లో 50ఏళ్లకు పైబడినవాళ్లే ఉన్నారని.. రాజకీయాల్లోకి యువకులు రావాలని పిలుపునిచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేల వారసులకే టికెట్లు ఇస్తున్నారన్నారు. తన పార్టీలో 60 నుంచి 65శాతం యువతకే టికెట్లు కేటాయిస్తామన్నారు.