లడఖ్‌లో మోడీ సంచలన వ్యాఖ్యలు

 సరిహద్దు ప్రతిష్టంభనపై సైనికాధికారులతో మోడీ సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే టాప్‌ కమాండర్లతోనూ సమావేశం కానున్నారు. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) సమీపంలో తాజా పరిస్థితిని సైనికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మోడీ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంత కఠిన పరిస్థితుల్లోనూ దేశాన్ని కాపాడుతూ సేవ చేస్తున్నారని జవాన్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ”మీ ధైర్య సాహసాలు అజరామరం. దేశ రక్షణ మీ చేతుల్లోనే ఉంది. దేశమంతా మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందుతోంది. మీ త్యాగాలే దేశాన్ని నడిపిస్తున్నాయి. భారత శత్రువులకు గట్టి గుణపాఠం నేర్పారు. లడఖ్‌ నుంచి కార్గిల్‌ వరకూ మీ ధైర్యం అమోఘం. ధైర్యవంతులే శాంతి కోరుకుంటారు. ప్రతి పోరాటంలో మనదే విజయం. శాంతిపై భారత్‌కు ఉన్న నిబద్ధత ప్రపంచమంతా గమనించింది. వీరత్వంతోనే శాంతి సాధ్యం అవుతుంది. శాంతిని కోరుకున్నంత మాత్రానా చేతులు కట్టుకొని కూర్చోం” అని ప్రధాని వ్యాఖ్యానించారు.
     జూన్‌ 15న గల్వాన్‌ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో ప్రధాని మోడీ లడఖ్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం లేV్‌ా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనికుల్ని మోడీ పరామర్శించనున్నారు.