శ్రీకాంత్ ని పరామర్శించిన చిరంజీవి
శ్రీకాంత్ ని పరామర్శించిన చిరంజీవి

శ్రీకాంత్ ని పరామర్శించిన చిరంజీవి

ప్రముఖ హీరో శ్రీకాంత్‌ను మెగాస్టార్‌ చిరంజీవి సోమవారం పరామార్శించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీకాంత్‌ తండ్రి మేక పరమేశ్వరరావు నిన్న(ఆదివారం) రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. పలువురు చలన చిత్ర ప్రముఖులు శ్రీకాంత్‌ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. మెగాస్టార్‌ చిరంజీవి సోమవారం శ్రీకాంత్‌ ఇంటికి వెళ్లి ఆయన తండ్రిగారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు