మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి రైతు పై ఉన్న రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చారు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రుణమాఫీ చేయలేదు. ఇప్పుడు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామని చెబుతున్నారు. కానీ తాజాగా రుణమాఫీపై కమిటి వేసి ఎవరికి చేయాలో ఎవరికి చేయకూడదతో పవిశీలిస్తామంటూ కబుర్లు చెబుతున్నారని ఎంపీ రఘునందన్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర రైతుల ఉండి భూమి ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం మోసపూరిత హామీలు ఇచ్చిందని, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి వల్లే రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.