ఏపీ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ మరో 2 లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేసింది. ఉండి, నరసరావుపేటలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాల కూల్చివేతలను సవాల్ చేస్తూ పిటిషన్లు వేసింది. వైఎస్సార్‌సీపీ పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది. కూల్చివేత చర్యలపై యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలంటూ బుధవారం ఇచ్చిన ఉత్తర్వులను నిర్ణయం వెలువరించేంత వరకు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కూల్చివేతలపై అధికారులను నియంత్రించాలంటూ పిటిషన్లు.. అన్ని జిల్లాల్లోని తమ పార్టీ కార్యాలయాల కూల్చివేతలకు పురపాలక శాఖాధికారులు జారీచేసిన షోకాజ్ నోటీసులను, ప్రాథమిక ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ, ఆ పార్టీ నేతలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కూల్చివేతకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేయాలని కోరారు. అలాగే, కూల్చివే తలకు పాల్పడకుండా అధికారులను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలంటూ అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే, గురువారం మరిన్ని వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ గురువారం మరోసారి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సీవీ మోహన్‌రెడ్డి, పి. వీరారెడ్డి, న్యాయవాదులు వీఆర్‌ఎన్ ప్రశాంత్, యర్రంరెడ్డి నాగిరెడ్డి, వీఆర్ రెడ్డి, వి. సురేందర్‌రెడ్డి, ఉగ్రనరసింహ, రాసినేని హరీష్, వివేకానంద విరూపాక్ష తదితరులు సుదీర్ఘ వాదనలు వినిపించగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
- Home
- News
- Andhra Pradesh
- వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌లు కూల్చివేతలు.. మరో 2 లంచ్‌మోషన్ పిటిషన్లు