20న ఒటిటిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్‌టిఆర్‌ మల్లీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఒటిటి ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కావడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం. ఈనెల 20 నుంచి ప్రముఖ ఒటిటి ప్లాట్‌ఫాం జీ5లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.