Monthly Archives: February 2020

గ్రూపు–2 అభ్యర్థుల జాబితా విడుదల

గ్రూపు–2 అభ్యర్థుల జాబితా విడుదల

రాష్ట్రంలో గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మంగళవారం విడుదల చేసింది. అభ్యర్థుల జాబితాను కమిషన్‌ నోటీస్‌ బోర్డులో ఉంచడంతో పాటు వైబ్‌సైట్‌లో కూడా పొందుపరిచినట్టు కమిషన్‌ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో పాటు 1:2 రేషియోలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కోసం 858 మంది అభ్యర్థులను ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది

Read More »

‘జాను’ సినిమాకు హ్యాండ్ కర్చీఫ్‌తో వెళ్లండి: సమంత

‘జాను’ సినిమాకు హ్యాండ్ కర్చీఫ్‌తో వెళ్లండి

‘జాను’ సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లే ప్రతి ఒక్కరూ తమతో పాటు హ్యాండ్ కర్చీఫ్‌లు తీసుకువెళ్లాలని సమంత అక్కినేని సలహా ఇచ్చారు. సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికీ హ్యాండ్ కర్చీఫ్ అవసరం ఉంటుందని అన్నారు. శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘జాను’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96’కి ఇది రీమేక్. మాతృకకు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగు వర్షన్‌నూ డైరెక్ట్ చేశారు. గోవింద్ వసంత సంగీతం సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ ...

Read More »

కేటీఆర్, హరీశ్‌లకు ఐటీశాఖ నోటీసులు!

కేటీఆర్, హరీశ్‌లకు ఐటీశాఖ నోటీసులు!

టీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు ముఖ్య నేతలకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. మూడేళ్ల క్రితం వారు చేపట్టిన గులాబీ కూలీ కార్యక్రమానికి సంబంధించి వివరాలు, లెక్కలు చెప్పాలంటూ ఐటీశాఖ ఇప్పుడు తాఖీదులిచ్చినట్లు తెలుస్తోంది. ఐటీశాఖ కన్ను పడిన వారిలో కొందరు మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. కేటీఆర్‌, హరీశ్‌ రావు, మహమూద్‌ అలీ, ఈటల రాజేందర్ సహా ఈ జాబితాలో చాలా మంది పేర్లు ఉన్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. మూడేళ్ల క్రితం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ పార్టీ ...

Read More »

నిర్భయ దోషుల ఉరి ఎప్పుడు? నేడు హైకోర్టు కీలక తీర్పు!

నిర్భయ దోషుల ఉరి ఎప్పుడు నేడు హైకోర్టు కీలక తీర్పు!

నిర్భయ దోషులను ఉరి తీసేదెప్పుడు..? క్షమాభిక్ష కోసం రాష్ట్రపతిని ఆశ్రయించిన ఇద్దర్నీ పక్కనబెట్టి మిగతా ఇద్దరు దోషులను ముందుగా ఉరి తీస్తారా? లేదంటే అందర్నీ కలిపి ఒకేసారి ఉరి తీస్తారా? ఈ ప్రశ్నలకు నేడు (బుధవారం) ఢిల్లీ హైకోర్టు తీర్పు రూపంలో సమాధానం లభించనుంది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు నిర్భయ దోషులను ఉరి తీయొద్దని ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ… కేంద్రం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. బుధవారం హైకోర్టు విచారణకు చేపట్టనుంది. నిర్భయ ...

Read More »

ప్రధాని మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ

ప్రధాని మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని ఆయన ప్రధాని మోదీని కోరారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ ఎంపీ ఇటీవలే స్పష్టం చేసిన తరుణంలో సీఎం లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా.. ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని జగన్ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆదాయం తెలంగాణకు వెళ్లిందని, ఏపీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. వివిధ రాష్ట్రాలు ...

Read More »

నేటి నుంచి మేడారం మహాజాతర ప్రారంభం

నేటి నుంచి మేడారం మహాజాతర ప్రారంభం

నేటి నుంచి మేడారం మహాజాతర ప్రారంభమైంది. మేడారానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. నేడు పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరుకోనున్నారు. ఆనవాయితీ ప్రకారం పెనుక వంశస్తులు మహబూబాబాద్ జిల్లా పోనుగొండ్ల నుంచి.. సమ్మక్క భర్త పగిడిద్దరాజును తీసుకురానున్నారు. పడిగిద్దరాజును తీసుకు వచ్చేందుకుు కాలినడకన 66 కి.మీ.అటవీ మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంది. పెనుక వంశస్తులు కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మవారిని సైతం తీసుకురానున్నారు.

Read More »

గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో ఇకపై రీఛార్జ్‌లు కూడా..!

గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో దొరకనిదంటూ ఉండదని మనకు తెలిసిన విషయమే. ఏదైనా మనకు అనుమానం వస్తే వెంటనే గూగుల్‌ తల్లి ఉంది కదా అంటూ వెంటనే మొబైల్‌ను వాడుతున్న యూజర‍్లకు గూగుల్‌ ఇప్పుడు ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు గూగుల్‌ సెర్చ్‌ ద్వారానే తమ ప్రీపెయిడ్‌ మొబైల్‌ను రీచార్జ్‌ చేసుకోవచ్చు. అందుకు గాను గూగుల్‌ సంస్థ దేశంలోని టెలికాం ఆపరేటర్లయిన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌ కంపెనీలతో భాగస్వామ్యం అయింది. ఈ క్రమంలో యూజర్లు గూగుల్‌ సెర్చ్‌లో ...

Read More »

చిరంజీవి, నాగార్జునతో మంత్రి తలసాని భేటీ

ప్రముఖ సినీనటులు చిరంజీవి, నాగార్జునతో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంగళవారం సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో ఈ భేటీ జరిగింది. సినిమారంగం అభివృద్ధి, సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చిరంజీవి, నాగార్జునలతో చర్చించారు.

Read More »

సీఎం జగన్‌ను కలిసిన రాజధాని రైతులు

రాజధాని ప్రాంతంలోని రైతులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతులంతా సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ వినతులను సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. రైతు కూలీలకు రూ. 2500 నుంచి 5 వేలు పెంచడంతో రైతులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గత పాలనలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాలను రైతులు వివరించారు. భేటీ అనంతరం అమరావతి రైతులు మీడియాతో మాట్లాడారు. తమకు అండగా ...

Read More »