Monthly Archives: February 2020

సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపిన జ్యోతి తల్లి

సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపిన జ్యోతి తల్లి

కరోనా వైరస్‌ కారణంగా చైనాలో చిక్కుకున్న జ్యోతి క్షేమంగా స్వదేశానికి చేరుకోవడంతో ఆమె తల్లి ముఖంలో ఆనందం విరబూసింది. భారత వైమానిక దళం గురువారం ప్రత్యేక విమానంలో చైనా నుంచి 112 మందిని ఇండియాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అందులో కర్నూలు వాసి అన్నెం జ్యోతి ఒకరు. కూతురు క్షేమంగా తిరిగి రావడంతో జ్యోతి తల్లి ప్రమీల తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. కూతురు తమ చెంతకు చేరేందుకు సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మనందరెడ్డికి, అధికారులకు, మీడియాకు ప్రమీల ...

Read More »

జగన్ పై ప్రశంసలు కురిపించిన జనసేన ఎమ్మెల్యే

జగన్ పై ప్రశంసలు కురిపించిన జనసేన ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన బాగుందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అన్నారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నానని పేర్కొన్నారు. విశాఖపట్నం రాజధానిగా ఉంటే గోదావరి ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాలన్ని అభివృద్ధి చెందుతాయని తెలిపారు. గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవసరమని స్పష్టం చేశారు. పవన్‌ కల్యాణ్‌, తాను ఈ మధ్య కాలంలో కలవలేదని.. ఎటువంటి సమాచారం రాలేదని చెప్పారు. తాను జనసేన పార్టీకి దూరంగా లేను..దగ్గరగా లేను.. జనసేన ...

Read More »

సీఎం జగన్ కి ఎమ్మెల్యే ఆర్కే లేఖ

సీఎం జగన్ కి ఎమ్మెల్యే ఆర్కే లేఖ

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే లేఖ రాశారు. నీరుకొండ కొండపై అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. గతంలో చంద్రబాబు ఐనవోలులో 20 ఎకరాలలో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటుకు శంకుస్దాపన చేశారని, అలాగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు గుర్తు చేశారు. అయితే స్మృతి వనం ఏర్పాటు పనులు ఆగిపోయినట్లు లేఖలో ఆర్కే పేర్కొన్నారు. అదే స్థాయిలో 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం నీరుకొండలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉగాది రోజున అంబేద్కర్ ...

Read More »

విద్యుత్ రంగంపై సీఎం జగన్ సమీక్ష

విద్యుత్ రంగంపై సీఎం జగన్ సమీక్ష

విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, ఆ విద్యుత్‌ను బయట అమ్మకోవాలనుకునే కంపెనీలకు, సంస్థలకు అనుకూలంగా పాలసీ తీసుకువస్తున్నామని ఆయన తెలిపారు. విద్యుత్‌రంగంపై బుధవారం సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్లాంట్లు పెట్టాలనుకునేవారికి సానుకూల వాతావరణం కల్పించేలా ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ ఉండాలని అధికారులకు సూచించారు. లీజు ప్రాతిపదికన పరిశ్రమలకు భూములిచ్చే ప్రతిపాదనపై ...

Read More »

జనగామలో కేటీఆర్‌ ఆకస్మిక పర్యటన

జనగామలో కేటీఆర్‌ ఆకస్మిక పర్యటన

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బుధవారం జనగామలో ఆకస్మికంగా పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా పలు కాలనీలను మంత్రి సందర్శించారు. అనంతరం జనగామలోని ధర్మకంచ బస్తీలో ప్రజలతో కేటీఆర్‌ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై కేటీఆర్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

Read More »

బుధవారం గణపతిని గరికతో ఇలా పూజిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం

బుధవారం గణపతిని గరికతో ఇలా పూజిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం

బుధవారం.. ఆదిదేవుడైన గణపతిని ఆలయాల్లో దర్శించుకోవడం మంచిదని పురోహితులు అంటున్నారు. అందుచేత బుధవారం ఉదయం, సాయంత్రం సమయాన సమీపంలోని బొజ్జగణపతి ఆలయానికి వెళ్లి.. గజనాథుడిని దర్శించుకోవడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా బుధవారం రోజున గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించి గరికను సమర్పించడం ద్వారా ఉన్నత ఫలితాలను పొందవచ్చునని పండితులు చెబుతున్నారు. అదే రోజున పెసల పప్పుతో చేసిన వంటలు అంటే పెసరట్లు, పెసరపప్పు పచ్చడి, పెసలతో చేసిన హల్వా, లడ్డు వంటి పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని పండితులు చెబుతున్నారు. ...

Read More »

కరివేపాకుని ఇలా చేసి తింటే డయాబెటీస్ రమ్మన్నా రాదు

కరివేపాకుని ఇలా చేసి తింటే డయాబెటీస్ రమ్మన్నా రాదు

కరివేపాకు లేని కూరలు రుచి ఉండవు. అయితే ఇది కూరలకు రుచి, సువాసనన మాత్రమే కాదు, చాలా ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. అది తెలియక మనలో చాలా మంది కూరలలో వేసిన కరివేపాకును మనం ఎరిపారేస్తుంటారు. కానీ వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఇక నుండి కరివేపాకును కూడా హ్యాపీగా తింటారు. ఓ నివేదిక ప్రకారం, కరివేపాకును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున, అది స్టార్చ్ ను ...

Read More »

బరువు పెరగకుండా ఉండాలంటే గార్డెన్‌లో ఇలా చేయండి..

బరువు పెరగకుండా ఉండాలంటే గార్డెన్‌లో ఇలా చేయండి..

గార్డెనింగ్.. ఇంట్లో ఉన్న తోటకి మంచి అందాన్ని తీసుకొచ్చే ఓ ప్రక్రియ. ఇది చేయడం మంచి ఎక్సర్‌సైజ్ అని చెప్పొచ్చు. దీని వల్ల శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఆనందంగా ఉంటారని చెబుతున్నారు. గార్డెనింగ్ చేయడం అంటే చెట్లకు నీరు పోసి.. కాయలు, పూలు కోస్తే సరిపోదు. అవి చక్కగా పెరిగేలా చూడాలి. ఇందుకోసం కలుపు మొక్కలు తీయడం, పాదులు తోడడం చెట్లకు నీరు సరిగ్గా చేరుతుందా లేదా చూడడం వంటివన్నీ చూడాలి. ఇలా చేస్తేనే మీరూ సరిగ్గా గార్డెనింగ్ చేసినట్లు. కాబట్టి ఇలా చేస్తుండండి. ఇలా చేయడం ...

Read More »

చిరు సినిమాలో మహేష్..ఫ్యాన్స్ కి రచ్చ రచ్చే..!

చిరు సినిమాలో మహేష్

ఫ్యాన్స్ కల మొత్తానికి నెరవేరింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే అది కన్‌‌ఫర్మ్ అని తేలిపోయింది. మహేష్ బాబుకి ‘భరత్ అనే నేను’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు దర్శకుడు కొరటాల శివ. ఆ నమ్మకంతోనే ప్రస్తుతం తాను చిరుతో చేస్తున్న సినిమాలో మహేష్‌ కోసం కూడా కీలక పాత్ర రాసుకున్నారు. ‘భరత్ అనే నేను’తో ...

Read More »

ఢిల్లీ ఘర్షణలు.. 20కి చేరిన మరణాలు

ఢిల్లీ ఘర్షణలు.. 20కి చేరిన మరణాలు..

ఢిల్లీ: సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో చనిపోయిన వారి సంఖ్య 20కి చేరింది. బుధవారం జీటీబీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ నలుగురు చనిపోయారు. అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13 నుంచి 20కి పెరిగింది. ఈ ఘర్షణల కారణంగా ఈశాన్య ఢిల్లీలోని 86 కేంద్రాల్లో సీబీఎస్‌ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఘర్షణలను తీవ్రంగా తీసుకున్న హోం మంత్రి అమిత్ షా.. నిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. ఢిల్లీలో పరిస్థితిని సమీక్షించేందుకు జాతీయ భద్రతా ...

Read More »