Monthly Archives: March 2020

సీసీసీ కి ప్ర‌భాస్ భారీ విరాళం

సీసీసీ కి ప్ర‌భాస్ భారీ విరాళం

కరోనా  వైరస్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకోవడమే లక్ష్యంగా చిరంజీవి అధ్యక్షతన ప్రారంభమైన కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తాయి. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సీసీసీ-మనకోసం’కు రూ.50 లక్ష‌లను విరాళంగా అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇది వ‌ర‌కే ప్ర‌భాస్ క‌రోనా వైర‌స్ నివార‌ణా చ‌ర్య‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వానికి మూడు కోట్ల రూపాయ‌లు, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కోటి రూపాయ‌ల విరాళాన్ని అందించిన సంగ‌తి తెలిసిందే.

Read More »

త్వరలోనే తెలంగాణ ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్‌

త్వరలోనే తెలంగాణ ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్‌

తెలంగాణ‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో త్వరలోనే వెల్లడిస్తామని రాష్ట్ర విద్యాశాఖ ప్ర‌క‌టించింది. మార్చి 23 నుంచి 30 వరకు జరగాల్సిన ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను హైకోర్టు ఆదేశాలతో వాయిదా వేసిన తెలిసిందే. అయితే మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 7 వరకు పరీక్షలను నిర్వహించాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మరోసారి వాయిదా తప్పలేదు.ఈ మేరకు భార‌త్‌లో క‌రోనా వ్యాప్తిని నివారించేందుకు ఏప్రిల్ 14 వ‌ర‌కు ...

Read More »

ఆంధ్ర ప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి 13 లక్షలు విరాళం ప్రకటించిన ANU యాజమాన్యం

ఆంధ్ర ప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి 13 లక్షలు విరాళం ప్రకటించిన ANU యాజమాన్యం

కరోనా వైరస్‌ నివారణ చర్యల కోసం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వడానికి సిద్ధం అయింది .ఒక్క రోజు వేతనం రూ 13,28,377 ని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపుతామని వైస్ ఛాన్సలర్ ఆచార్య పి . రాజశేఖర్ తెలిపారు .ఆ సందర్బముగా బోధన, బోధనేతర సిబ్బంది కి వైస్ ఛాన్సలర్ అభినందనలు తెలిపారు

Read More »

కలెక్టర్లు, ఎస్పీలతో జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

కలెక్టర్లు, ఎస్పీలతో జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలు, నిత్యావసర సరుకులు అందుబాటు, రేషన్‌ సరఫరా తదితర కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.అలాగే కరోనా వైరస్‌ వ్యాప్తి, నివారణ చర్యలపై సమీక్ష జరిపారు. ఇక లాక్‌డౌన్‌ వెలుసుబాటు సమయాన్ని తగ్గించిన నేపథ్యంలో అమలు అవుతున్న తీరుపై సీఎం జగన్‌ సమీక్షించారు. అంతరాష్ట్ర సరిహద్దులు ఉన్న జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి చర్చించారు.

Read More »

జగన్ కి లేఖ రాసిన సిపిఐ రామకృష్ణ

జగన్ కి లేఖ రాసిన సిపిఐ రామకృష్ణ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. కరోనా విపత్తు వల్ల లాక్‌డౌన్ నేపథ్యంలో తొలగించిన కార్డు దారులకు కూడా రేషన్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ పంపిణీలో చౌకడిపోల వద్ద ప్రజలకు పలు సమస్యలు ఎదురవుతున్నాయని తెలియజేశారు. వ్యక్తిగత దూరం పాటించకుండా వందల సంఖ్యలో రేషన్ దార్లు క్యూలైన్లో ఉంటున్నారని రామకృష్ణ పేర్కొన్నారు.

Read More »

శుభవార్త చెప్పిన కేటీఆర్‌

శుభవార్త చెప్పిన కేటీఆర్‌

తెలంగాణ ప్రజలకు ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ శుభవార్త చెప్పారు. గతంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన 11 కేసులు చికిత్స అనంతరం ఆదివారం జరిపిన పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చాయని తెలిపారు. ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. అంతకు క్రితం ప్రపంచ వ్యాప్త కరోనా మరణాల గ్రాఫ్‌ గురించి ఆయన చర్చించారు. కరోనా పోరులో ప్రపంచ దేశాల కంటే భారత్‌ ఎంతో ముందుందని, చైనా కంటే ఇటలీ, స్పెయిన్‌, యూకే, యూఎస్‌లలో కరోనా వైరస్‌ మరణాల రేటు వేగంగా పెరుగుతోందని తెలిపారు.బెల్జియం, భారత్‌ అన్నిటికన్నా ...

Read More »

ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు జగన్ -ఎమ్మెల్యే రోజా

ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు జగన్ -ఎమ్మెల్యే రోజా

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పేద ప్రజలు తిండికి ఇబ్బంది పడొద్దనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్‌ ఉచితంగా అందిస్తున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. మూడు నెలలకు సరిపోయే రేషన్‌ను మూడు విడతల్లో అందిస్తామని చెప్పారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ఈ రోజు మొదటి విడత రేషన్‌ను అందించామన్నారు. ఏప్రిల్‌ 15న రెండో విడత, ఏప్రిల్‌ 29న మూడో విడత రేషన్‌ను అందిస్తామన్నారు. ప్రతి వ్యక్తికి ఐదు కిలోల ...

Read More »

నేటి నుంచి ఏపీలో ఉచిత రేషన్‌ పంపిణీ

నేటి నుంచి ఏపీలో ఉచిత రేషన్‌ పంపిణీ

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రేషన్‌ కార్డుదారులకు నిత్యావసర సరుకులను ఈ నెల 29 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రతి కార్డుదారుడికి కేటాయించిన బియ్యంతో పాటు కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేస్తారు. పంచదార పొందడానికి గతంలో మాదిరిగానే నగదు చెల్లించాల్సి ఉంటుంది. 35.98 లక్షల మంది లబ్ధిదారులు జిల్లాలో అన్నపూర్ణ కార్డులు 465, అంత్యోదయ కార్డులు 65,411, తెల్లకార్డులు 12,27,060 ఉన్నాయి. వీటి పరిధిలో 35,98,408 మంది లబ్ధిదారులు (యూనిట్స్‌) ఉన్నారు. ...

Read More »

నేడు ఆక్వారంగంపై జగన్ సమీక్ష

నేడు ఆక్వారంగంపై జగన్ సమీక్ష

ఏపీలో రొయ్య రైతులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. చేపలు, రొయ్యల కొనుగోళ్ల నిలిపివేయడంతో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే రూ.2వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. నెల్లూరులో 11 ప్రాసెసింగ్‌ యూనిట్లు నిలిపివేతకు గురయ్యాయి. నేడు ఆక్వా రంగంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు.

Read More »

వచ్చే మూడు నెలలు EMI కట్టకపోయిన పర్వాలేదు

వచ్చే మూడు నెలలు EMI కట్టకపోయిన పర్వాలేదు

దేశవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు కొనసాగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కీలక మైన రెపో రేటును 75 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. అలాగే అన్ని రకాల లోన్లుపై 3 నెలలు మారిటోరియం ప్రకటించింది. శుక్రవారం గవర్నరు శక్తికాంత దాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్థిక సుస్థిరత ఉండేలా చర్యలు చేపట్టామని, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని ఆయన తెలిపారు. వచ్చే మూడు నెలలు ఈఎంఐలు కట్టకపోయినా ఫర్వాలేదని, ఇప్పుడు కట్టాల్సిన లోన్లు తర్వాత కట్టుకునే ...

Read More »