Monthly Archives: April 2020

భారతి సిమెంట్స్‌ రూ.5 కోట్ల విరాళం

భారతి సిమెంట్స్‌ రూ.5 కోట్ల విరాళం

కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరు తమవంతుగా సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే పలు కార్పొరేట్‌ సంస్థలు ఏపీకి భారీ విరాళాలు ప్రకటించగా..తాజగా భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీసీసీపీఎల్‌) తనవంతు సహాయాన్ని అందించింది. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకుగాను సీఎం సహాయనిధికి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అలాగే భారతి సిమెంట్స్‌ ఉద్యోగులు 14.5 లక్షల విరాళాన్ని అందజేశారు. వర్షిని చారిటబుల్‌ ట్రస్ట్‌ రూ.1.10 కోట్లు విరాళం ప్రకటించింది

Read More »

ఏకాంతంగా శ్రీ సీతారాముల కల్యాణం

ఏకాంతంగా శ్రీ సీతారాముల కల్యాణం

శ్రీరామనవమి వేడుకలు భద్రాచలంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ప్రతినిధులుగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌లు హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. కరోనా వైరస్‌ కారణంగా ఈ సారి భక్తజనం లేకుండానే సీతారామ కల్యాణం, పట్టాభిషేకం క్రతువులు జరగనున్నాయి. వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో స్వామివారి కల్యాణం జరుగుతోంది. ఏటా మిథిలా స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించేవారు. ఈసారి ఆలయంలోని మండపంలోనే రాములవారి కల్యాణం జరగుతోంది. వేదపండితులు, అర్చకులు, పోలీసు, ...

Read More »

సీఎంలతో మోదీ, అమిత్‌ షా వీడియో కాన్ఫరెన్స్‌

సీఎంలతో మోదీ, అమిత్‌ షా వీడియో కాన్ఫరెన్స్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం ప్రారంభమైంది. కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలు, రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులపై ఈ భేటీలో చర్చించనున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా వలస కార్మికుల సామూహిక ప్రయాణాలు, తబ్లిగి జమాత్‌లో పాల్గొన్నవారికి కరోనా సోకడం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. ఇక లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచడం.. తదితర అంశాలు ఆ సమావేశంలో చర్చకు రానున్నాయి

Read More »

ఏపీ లో 132 కి చేరిన కరోనా కేసులు

ఏపీ లో 132 కి చేరిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నాడు మరో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 132 కి చేరాయి. నెల్లూరులో గురువారం ఒక్క రోజే 17 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు మొత్తం 20 పాజిటివ్‌ కేసులు నెల్లూరులో నమోదయ్యాయి. ఇక మిగిలిన జిల్లాల విషయానికి వస్తే పశ్చిమ గోదావరిలో 14, విశాఖపట్నంలో 11, ప్రకాశం జిల్లాలో 17, కర్నూల్‌లో 1, కృష్ణాజిల్లాలో 15, కడపలో 15, గుంటూరులో 20లో నమోదయ్యాయి.ఇక తూర్పుగోదావరిలో 9, ...

Read More »

కరోనా సోకినా వారిపై వివక్షత చూపవద్దు -సీఎం జగన్

కరోనా సోకినా వారిపై వివక్షత చూపవద్దు -సీఎం జగన్

కరోనా వైరస్‌ లక్షణాలు గుర్తించి వైద్యం అందించడంలో సమగ్ర విధానం అవలంభిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రెండు రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడం బాధ కలిగిస్తోందన్నారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతి ఒక్కరినీ, వారితో కాంటాక్టులో ఉన్నవారినీ గుర్తిస్తున్నామని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. వైరస్‌ వస్తే ఏదో జరిగిపోతుందని అనుకోవద్దన్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వైరస్‌ను అరికట్టవచ్చని చెప్పారు. వయసు మళ్లినవారిలో ...

Read More »

2 వేల క్వారంటైన్ బెడ్లు సిద్ధం: మంత్రి బొత్స

2 వేల క్వారంటైన్ బెడ్లు సిద్ధం

కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిరోజు సమీక్షిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు పాటించి వైరస్‌ నియంత్రణకు సహకరించాలని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరూ తప్పకుండా సామాజిక దూరం పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసరాలు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఢిల్లీ వెళ్లినవారు స్వచ్చంధంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. సరిహద్దుల్లో ఉన్నవారికోసం భోజన వసతి ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు ...

Read More »

పోలీసులపై ప్రశంసలు కురిపించిన సజ్జల రామకృష్ణ రెడ్డి

పోలీసులపై ప్రశంసలు కురిపించిన సజ్జల రామకృష్ణ రెడ్డి

ప్రపంచానికి కష్టకాలం వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనాకు పూర్తి స్థాయి మందు రాలేదని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మనకున్న వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నామన్నారు. మిగిలిన రాష్ట్రాలకంటే మన దగ్గర కొంత మెరుగ్గా ఉందని, పోలీసులు సైనికుల్లాగ పనిచేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పోలీసులకు శానిటైజర్లు, మాస్కులను బుధవారం సజ్జల పంపిణీ చేశారు.

Read More »

కరోనా, ఆర్టీసీపై సీఎం జగన్ సమీక్ష

నేడు కరోనా, ఆర్టీసీపై సీఎం జగన్ సమీక్ష

ఇవాళ ఉదయం11 గంటలకు రాష్ట్రంలో కరోనాపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అలాగే మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్టీసీపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు మంత్రి పేర్ని నాని, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

Read More »