Monthly Archives: April 2020

సత్యం కోసం‌ పయనించిన శంకరులు..వైశాఖ శుద్ధ పంచమి శ్రీ ఆది శంకరాచార్య జయంతి

సత్యం కోసం‌ పయనించిన శంకరులు..వైశాఖ శుద్ధ పంచమి శ్రీ ఆది శంకరాచార్య జయంతి

ఆనాటి సమకాలీన హిందూమత ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలిచేవారు, హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరాచార్యులు ‘అద్వైత’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు క్రీ.శ. 788 సంవత్సరంలో కేరళా రాష్ట్రంలో ‘కాలడి’ అనే గ్రామంలో వైశాఖ శుద్ధ పంచమి రోజున శ్రీమతి ఆర్యాంబ, తండ్రి బ్రహ్మశ్రీ శివగురుదేవులనే విశ్వాబ్రాహ్మణ పుణ్య దంపతులకు జన్మించి క్రీ.శ 820 సంవత్సరంలో శివైక్యం పొందారు. ...

Read More »

చంద్రబాబు పై ధ్వజమెత్తిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్

చంద్రబాబు పై ధ్వజమెత్తిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్

ప్రతిపక్షనేత చంద్రబాబుపై రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరోనా క్లిష్ట సమయంలో చంద్రబాబు నీచ, నికృష్ట రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయనలాంటి ప్రతిపక్షనేత ఉండటం దురదృష్టకరం అన్నారు. కరోనా కట్టడి చర్యల్లో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌ మెరుగ్గా ఉందన్నారు. దేశంలో కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి తెలిపారు. మొత్తం టెస్టుల్లో దేశవ్యాప్తంగా 4.5 కేసులు నమోదవుతోంటే.. ఏపీలో అతి తక్కువగా 1.5 శాతం కరోనా కేసులు నమోదవుతున్నాయని మంత్రి వెల్లడించారు.ముఖ్యమంత్రి ...

Read More »

‘జగనన్న విద్యాదీవెన’ ప్రారంభించిన సీఎం జగన్‌

‘జగనన్న విద్యాదీవెన’ ప్రారంభించిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో.. మంగళవారం ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల విద్యార్థులతో సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, విద్యార్థులు తల్లులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఇంతకు ముందు తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ...

Read More »

జగన్ సర్కార్ మరో కొత్త పథకం.. 12 లక్షల మందికి లబ్ది

జగన్ సర్కార్ మరో కొత్త పథకం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే జగనన్న అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన పథకాలు ప్రవేశపెట్టిన సీఎం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఇవాళ జగనన్న విద్యాదీవెన పేరుతో మరో పథకాన్ని ప్రారంభించనున్నారు. పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇక ఈ పథకాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ...

Read More »

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఆ వయసుల వారికే కరోనా ఎక్కువట!

ఏపీ ప్రజలకు అలర్ట్.

ఏపీలో కరోనా ఓవైపు పంజా విసురుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయింది. గత రెండు, మూడు రోజులుగా 200కిపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే పరీక్షల సంఖ్య పెరగడంతో కేసులు కూడా బయటపడుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా రెడ్‌జోన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. అక్కడ నిత్యావసరాలు, మందులు వంటివి వాలంటీర్ల సాయంతో ఇళ్లకు పంపిణీ చేస్తున్నారు. పోలీసులు జనాలను బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఉదయం సమయంలో కూడా జనాల్ని బయటకు ...

Read More »

సుప్రీంకోర్టుకూ కరోనా సెగ..

సుప్రీంకోర్టుకూ కరోనా సెగ..

 కరోనా వైరస్ సెగ దేశ అత్యున్నత న్యాయస్థానానికీ తాకింది. కోర్టులోని జుడీషియల్ విభాగంలో పనిచేసే ఉద్యోగికి కరోనా సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. ఈ నెల 16న విధులకు హాజరైన ఆయన ఆ తర్వాత రెండు రోజులపాటు జ్వరంతో బాధపడడంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. సోమవారం నాటి రిపోర్టుల్లో అతడికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించిన అధికారులు.. ఆయనతో సన్నిహితంగా మెలిగిన ఇద్దరు రిజస్ట్రార్లను సెల్ఫ్ క్వారంటైన్‌కు పంపారు. అలాగే, 16వ తేదీ నుంచి విధులకు హాజరవుతున్న ఉద్యోగులందరికీ ...

Read More »

జగన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ చంద్రబాబు

జగన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ చంద్రబాబు

కరోనాతో కలిసి జీవించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు ఆందోళన కలిగించే అంశమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.  కరోనా వైరస్‌ కేవలం జ్వరం మాత్రమేనని తరచూ చెప్పే వ్యక్తిని ఏమనాలని ఆక్షేపించారు. జగన్‌ నిర్లక్ష్య వైఖరి కారణంగానే కరోనా కేసుల నమోదులో ఆంధ్రప్రదేశ్‌.. దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ఇక భగవంతుడే ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలన్నారు. ఈమేరకు జగన్‌ చేసిన వ్యాఖ్యల వీడియోను చంద్రబాబు ట్విటర్లో పోస్టు చేశారు.

Read More »

యూపీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియాంక గాంధీ

యూపీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియాంక గాంధీ

ఉత్తరప్రదేశ్ సర్కార్‌పై కాంగ్రెస్‌ పా​ర్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. గడిచిన 15 రోజుల్లో రాష్ట్రంలో 100 మంది హత్య గురయ్యారని అన్నారు. ఈ మేరకు మంగళవారం తన ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ పోస్ట్‌ చేశారు. ‘ఉత్తర ప్రదేశ్‌లో గత 15 రోజుల్లో వంద మంది హత్య చేయబడ్డారు. మూడు రోజుల క్రితం పచౌరి కుటుంబానికి చెందిన ఐదు మృతదేహాలను ఎటాలో అనుమానాస్పద పరిస్థితులలో పోలీసులు కనుగొన్నారు. వారికి ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. దీనికి ఎవరి హస్తం ...

Read More »

ఏపీలో 1259 కి చేరిన కరోనా కేసులు

ఏపీలో 1259 కి చేరిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 82 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,259కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో 5,783 మందికి పరీక్షలు నిర్వహించగా 82 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో.. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 258 డిశ్చార్జి కాగా, 31 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 970 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Read More »

రైతన్నలకు లక్ష క్రెడిట్, డెబిట్ కార్డులు.. సీఎం జగన్ కీలక నిర్ణయం

రైతన్నలకు లక్ష క్రెడిట్, డెబిట్ కార్డులు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని రైతులకు క్రెడిట్, డెబిట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు రైతు భరోసా కేంద్రాలపై సోమవారం సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫార్మర్‌ క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డులు తీసుకొస్తే రైతులకు మరింత ఉపయోగంగా ఉంటుందని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఆ ...

Read More »