Monthly Archives: May 2020

ఏపీ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా వాణీమోహన్‌

ఏపీ ఎన్నికల కమిషన్‌ నూతన కార్యదర్శిగా వాణీ మోహన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సహకార శాఖ కమిషనర్, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ఎండీ వాణీ మోహన్‌కు ఈ బాధ్యతలను కూడా అదనంగా అప్పగించారు.

Read More »

భారత్ లో ఒక్క రోజే 8,380 కరోనా కేసులు

భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,380 కరోనా కేసులు నమోదు కాగా, 193 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,82,143కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఒక్క రోజు వ్యవధిలో దేశంలో ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు 86,983 మంది కరోనా నుంచి కోలుకోగా.. 5,164 మంది ...

Read More »

మరింత అప్రమత్తంగా ఉండాలి : మోదీ

కరోనా వైరస్‌పై పోరులో భారత ప్రజల సేవా శక్తి కనిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆదివారం మన్‌ కీ బాత్‌ ద్వారా దేశ ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. దేశంలో చాలా వరకు ఆర్థిక కార్యకలాపాలు పున: ప్రారంభమయ్యాయని చెప్పారు. కరోనాపై పోరులో వైద్య సిబ్బంది, మీడియా ప్రాణాలు లెక్కచేయకుండా పనిచేశారని కొనియాడారు. కరోనాకు సంబంధించి భవిష్యత్తులో మరింత అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని తెలిపారు.కరోనాపై విజయం సాధించడానికి మరింతగా శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. ...

Read More »

దేశవ్యాప్తంగా జూన్‌ 30 వరకు లాక్‌డౌన్

దేశ వ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్-30 వరకు లాక్ డౌన్‌ పొడిగించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. జూన్‌ 8 నుంచి ప్రార్థనామందిరాలు, హోటళ్లు, మాల్స్‌ ప్రారంభం కానున్నాయి. రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే స్కూళ్లు, కాలేజీలకు అనుమతిస్తామని కేంద్రం తెలిపింది. కట్టడి ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ మరింత కఠినతరం చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఇకపై రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. కాగా.. అంతర్జాతీయ ప్రయాణాలు, సినిమా ...

Read More »

ప్రధాని మోదీపై అమిత్‌ షా ప్రశంసలు

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శుభాకాంక్షలు తెలిపారు. దూరదృష్టి, నిర్ణయాత్మక నాయకత్వం నేతృత్వంలో దేశాన్ని మరింత ముందుకు నడిపిస్తున్నారని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. 60 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ పాలనలో చేసిన చారిత్రాత్మక తప్పిదాలను ఆరేళ్ల కాలంలో నరేంద్ర మోదీ సరిచేసి చూపారని కొనియాడారు. మోదీ గత ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఫలితమే మరోసారి అద్భుతమైన విజయాన్ని తెచ్చిపెట్టాయని అభినందించారు. 130 కోట్ల ప్రజలకు మోదీ నాయకత్వ ...

Read More »

రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ముఖ్యమంత్రిగా పదవీ బాద్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఏకకాలంలో 10,641 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ఆన్‌లైన్‌ వీడియో ద్వారా వీక్షిస్తూ ఆరంభించారు. అంతకు ముందు సీఎం జగన్‌ను వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎమ్‌వీఎస్‌ నాగిరెడ్డి కండువా కప్పి అభినందనలు తెలిపారు. మొట్టమొదటగా కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండురంగపురం కేంద్రం ఆర్‌బీకేలో లభించే సేవలను పరిశీలించారు

Read More »

దేశంలో ఒక్క రోజే 7964 కేసులు

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7964 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 265 మంది మరణించారు. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం కావడం గమనార్హం. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,73,763కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 82,369 మంది కరోనా నుంచి కోలుకోగా.. 4,971 మంది ...

Read More »

ఆరోగ్య రంగంలో అనేక మార్పులు తెచ్చాం: సీఎం జగన్‌

ఈ ఏడాదికాలంలో ఆరోగ్య రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పేదవాడికి విద్య, వైద్యం అందుబాటులో ఉండాలనే నిర్ణయాలు తీసుకున్నారని, ఆయన మరణం తర్వాత ఆ రెండూ పేదవాడికి దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 90శాతం నెరవేర్చామని చెప్పారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ, ఆసుపత్రుల్లో​ నాడు- నేడుపై తాడేపల్లిలోని ...

Read More »

నిమ్మగడ్డ పిటిషన్ పై తుదితీర్పు ఇచ్చిన హై కోర్ట్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్ట్‌ కొట్టివేసింది. ఆర్టికల్‌ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ ఇచ్చే అధికారం లేదంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Read More »

ఒక్కరోజే 7,466 కరోనా కేసులు

భారత్‌పై కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,466 కరోనా కేసులు నమోదు కాగా, 175 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,65,799కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, దేశంలో ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి 71,105 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 4,706 మంది మృతిచెందారు.

Read More »