Monthly Archives: May 2020

ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం కొత్తగా మరో 48 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2137కి చేరుకుంది. గత 24 గంటల్లో 9284మంది శాంపిల్స్‌ పరీక్షించగా.. అందులో 48 మందికి కరోనా సోకినట్టుగా నిర్థారణ అయింది. కొత్తగా గుంటూరు జిల్లాలో 12, చిత్తూరు జిల్లాలో 11, కర్నూలు జిల్లాలో 7 , కృష్ణా జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జల్లాలో 4,అనంతపురం జిల్లా నుంచి 3 కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనాతో ...

Read More »

20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకెజీ ప్రకటించిన మోడీ

కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మే 17తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల మందికి కరోనా సోకిందని, దాదాపు 2 లక్షల 75 వేల మంది మరణించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా మొత్తం ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసిందన్నారు. తమ జీవితంలో ఎవరూ ఇలాంటి ఉపద్రవాన్ని కనీవిని ఎరుగరని మోదీ తెలిపారు. మానవజాతికి ఇది ఊహాతీతమని.. అలసిపోవద్దు, ఓడిపోవద్దు, కుంగిపోవద్దు, పోరాటంతోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సంక్షోభం ...

Read More »

చంద్రబాబు పై మండిపడ్డ శ్రీకాంత్ రెడ్డి

రాష్ట్రంలో కరోనా కేసులు పెరగాలన్నదే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి ఆలోచన అని ప్రభుత్వచీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు. కరోనాపై చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోన్నారని ధ్వజమెత్తారు. మంగళవారం తాడేపల్లిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కరనా కట్టడికి ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తోందని శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. కష్టకాలంలో సీఎం జగన్‌ ప్రజలకు అండగా నిలుస్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని కరోనా పరీక్షలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయన్నారు. సీఎం జగన్‌ పనితీరును ఇతర రాష్ట్రాల ...

Read More »

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. దీంతో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఎస్సాఆర్‌‌నగర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి

Read More »

ఆస్పత్రి నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిశ్చార్జి

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆదివారం రోజున ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు ఆయనను డిశ్చార్జి చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎటువంటి సమస్య లేదని ఎయిమ్స్‌ వర్గాలు తెలిపాయి.కాగా, ఛాతీ నొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరిన సమయంలో మన్మోహన్‌కు జ్వరం కూడా వచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా వైద్యులు.. ఆయనకు కరోనా పరీక్ష ...

Read More »

ఏపీలో 2051కి చేరిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం కొత్తగా 33 కరోనా వైరస్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2051కి చేరుకుంది. గత 24 గంటల్లో 10,730 మంది శాంపిల్స్‌ పరీక్షించగా.. అందులో 33 మందికి కరోనా సోకినట్టుగా నిర్థారణ అయింది. కొత్తగా చిత్తూరు జిల్లాలో 10, నెల్లూరు జిల్లాలో 9, కర్నూలు జిల్లాలో 9 చొప్పున, కృష్ణా జిల్లాలో 4, పశ్చిమ గోదావరి జల్లా నుంచి ఒక కరోనా కేసు నమోదైంది.

Read More »

మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించునున్న మోదీ

మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించునున్న మోదీ

కరోనా కట్టడికి దేశ వ్యాప్తింగా విధించిన లాక్‌డౌన్‌ మే 17తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రజల ముందుకు రానున్నారు. ఈ రోజు (మంగళవారం) రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మాట్లాడనున్నారు. లాక్‌డౌన్ సడలింపులు, కొనసాగింపు, కరోనా కట్టడిపై ప్రధాని ప్రసంగించే అవకాశం ఉంది. సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని దృష్టికి సీఎంలు అనే సమస్యలను తీసుకువచ్చారు. దీంతో నేటి ప్రసంగంలో వాటిపై మాట్లాడే అవకాశం ఉంది.

Read More »

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే ప్రత్యేక రైళ్లు

లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి ప్రయాణికుల రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ మంగళవారం నుంచి పరిమిత సంఖ్యలో నడపనుంది. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ మీదుగా నడిచే రైళ్లను రైల్వే అధికారులు ప్లాన్‌ చేశారు. అందులో తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి మార్గం : బెంగళూరు–న్యూఢిల్లీ ట్రైన్‌ నెంబర్‌: 02691 సర్వీస్‌: డెయిలీ మధ్యలో నిలిచే స్టేషను: అనంతపురం, గుంతకల్లు జంక్షన్, సికింద్రాబాద్‌ జంక్షన్, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ ప్రారంభం: 12.05.2020 మార్గం : న్యూఢిల్లీ–బెంగళూరు ట్రైన్‌ నెంబర్‌: ...

Read More »

70 వేలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

70 వేలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతోంది. మంగళవారం ఉదయం నాటికి దేశంలో 70,756 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3604 పాజిటివ్‌ కేసులతో పాటు 87 మంది బాధితులు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2293కి చేరింది. దేశంలో ప్రస్తుతం 46,006 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 22454 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చారి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ...

Read More »

మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌

కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని, ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ వ్యాఖ్యలు చేశారు. కరోనాపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని, భయం, ఆందోళన తొలగించడం ద్వారానే సాధారణ పరిస్థితులు వస్తాయని చెప్పారు. ఏపీలో 3 సార్లు సమగ్ర సర్వే జరిగిందని మోదీతో జగన్‌ చెప్పారు. కేంద్రం ఇచ్చిన సూచనల వల్లే కేసుల్ని నియంత్రించగలిగామన్నారు. కోవిడ్‌ను నియంత్రించలేకపోతే ముందుకు వెళ్లలేమని మోదీకి జగన్ వివరించారు. కరోనా లక్షణాలు ఉన్నా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి చెప్పట్లేదని, అవసరమైన శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని జగన్‌ ...

Read More »